
చేవెళ్ల, వెలుగు: ఇటీవల కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోకి మరో నాలుగు గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోకి కందవాడ, పల్గుట, మల్రెడ్డిగూడ, పామేన గ్రామ పంచాయతీలను కలుపుతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో చేవెళ్ల, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి, మల్కాపూర్, కేసారం గ్రామాలుండగా, మరో నాలుగు కలపడంతో మొత్తం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో 13 గ్రామ పంచాయతీలతో ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్నాయి.