ఫ్యాబ్ సిటీకి కొత్తగా నాలుగు ఆర్టీసీ బస్సులు

ఫ్యాబ్ సిటీకి కొత్తగా నాలుగు ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్​నుంచి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్​సిటీకి ‘90/253టీ’ పేరుతో కొత్తగా బస్​సర్వీసును ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ జోన్​ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జులై 1 నుంచి మొత్తం నాలుగు బస్సులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాణిగంజ్ డిపో నుంచి తుక్కుగూడ, మహేశ్వరం మండలం మీదుగా ఈ బస్సులు నడుస్తాయన్నారు. డెయిలీ ఫ్యాబ్​సిటీ, పరిసరాల్లో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు వెళ్తున్నారు. వారికి సౌకర్యంగా ఉండేలా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తుక్కుగూడ, మహేశ్వరం, ఆలుగడ్డ బావి, తార్నాక, ఎన్జీఆర్ఐ, సర్వే ఆఫ్​ ఇండియా, నాగోలు మెట్రోస్టేషన్, నాగోలు, అల్కాపురి, సాగర్​క్రాస్​రోడ్స్, గాయత్రి నగర్, చంపాపేట క్రాస్​రోడ్స్, పిసల్​బండ, పూల్ బాగ్, బార్కాస్, సదర్​నగర్, జల్ పల్లి క్రాస్​రోడ్స్, పహాడీషరీఫ్, షీప్​ఫామ్, సర్దార్​నగర్, తక్కుగూడ, ఇమాంగూడ మీదుగా ఫ్యాబ్​సిటీకి కొనసాగుతాయన్నారు.

రోజూ ఉదయం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు బయలుదేరుతుందని, ఆఖరి బస్సు 7.45కు ఉంటుందని చెప్పారు. అలాగే ఫ్యాబ్​సిటీ నుంచి సాయంత్రం 7.40 గంటలకు మొదటి బస్సు, ఆఖరి బస్సు రాత్రి 9.35 గంటలకు బయలుదేరుతాయన్నారు.