భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కమలా నెహ్రూ చిల్డ్రన్స్ ఆస్పత్రిలోని న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు శిశువులు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. ఆస్పత్రిలోని మూడో భవనంలోని ఐసీయూలో మంటలు చెలరేగాయని.. విషయం తెలిసిన వెంటనే ఇక్కడకు చేరుకున్నామని ఫతేగఢ్ ఫైర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జుబేర్ ఖాన్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. 36 మంది చిన్నారులను కాపాడామని.. వారిని ఇతర వార్డులకు తరలించామని చెప్పారు.
भोपाल के कमला नेहरू अस्पताल के चाइल्ड वार्ड में आग की घटना दुखद है। बचाव कार्य तेजी से हुआ। घटना की उच्चस्तरीय जांच के निर्देश दिए हैं। जांच एसीएस लोक स्वास्थ्य एवं चिकित्सा शिक्षा मोहम्मद सुलेमान करेंगे।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 8, 2021
ఈ ఘటన చాలా బాధాకరమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శిశువుల మృతికి ఆయన సంతాపం తెలిపారు. ‘ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు శిశువులను మేం బతికించలేకపోయాం. ఇది చాలా బాధాకరం. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. మంటలు అదుపులోకి వచ్చాయి’ అని చౌహాన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఏసీఎస్) హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుందని చౌహాన్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.