ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు వద్ద లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గాండ్ల పెంట మండలం కమ్మరపల్లె వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.