వరల్డ్ టాప్ వ్యాల్యూ 100 కంపెనీల్లో నాలుగు ఇండియన్ బ్రాండ్సే

వరల్డ్ టాప్ వ్యాల్యూ 100 కంపెనీల్లో నాలుగు ఇండియన్ బ్రాండ్సే

బిజినెస్ లో భారత్ కూడా అగ్రదేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. మోస్ట్ వ్యాల్యూ సంస్థల్లో ప్రపంచ దేశాల కంపెనీలను బీట్ చేస్తున్నాయి. ఇండియాలో మొదటి రెండు ప్లేసుల్లో ఉన్న విలువైన కంపెనీలు.. వరల్డ్ టాప్ 100లో నిలిచాయి. కాంటర్ బ్రాండ్స్ అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్‌ల నివేదిక 2024 ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఇండియాకు చెందిన నాలుగు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అత్యంత విలువైనవిగా చోటు దక్కించుకున్నాయి. 

కాంటర్ బ్రాండ్స్ మోస్ట్ వ్యాల్యూ గ్లోబల్ బ్రాండ్స్ 2024 రిపోర్ట్ లో ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ 46, 47 ప్లేస్ లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. ఎయిర్ టెల్ కంపెనీ 73వ ర్యాంక్, ఇన్ ఫోసిస్ 74వ ర్యాంక్ సాధించాయి. ఈ ఐటీ కంపెనీలు భారత్ లో కూడా అనేక మందికి సేవలు అందిస్తూ చాలా ఫామ్ లోఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి లాభాలు పొందుతూ భారత్ పేరు నిలబెడుతున్నాయి.