దోమలగూడ గ్యాస్ లీకేజ్ ఘటన.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

దోమలగూడ గ్యాస్​ లీక్​ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. జులై 14న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దోమలగూడ రోజ్​కాలనీలో ఈ నెల 11న పిండి వంటలు చేస్తుండగా గ్యాస్​లీక్​అయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మీ కుమార్తె శరణ్య చికిత్స పొందుతూ ఈ నెల 12 న మృతి చెందింది. 

ఇవాళ పద్మ(53), ధనలక్ష్మీ(28), అభివన్(7) చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో వారి కాలనీలో విషాదం నెలకొంది. అయితే ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు.