రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలుర్ గ్రామ పరిధిలోని శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం కారును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇమ్మరసు రామస్వామి (36), బికని యదయ్య(35), కేశవులు(33) అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రంగా గాయపడ్డ మోత శ్రీను(35)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ్యాక్ ప్రాజెక్ట్స్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరిగింది.