అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీస్ అధికారులపై వేటు

అవినీతి ఆరోపణలు.. నలుగురు పోలీస్ అధికారులపై వేటు

విధుల్లో అలసత్వం వహించిన..అవినీతికి పాల్పడిన ఖాకీలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఎంతటి వారినైనా వదలకుండా సస్పెండ్ చేస్తుంది. లేటెస్ట్ గా  అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ విధించింది.

 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన డబ్యూఎస్ఐ  సోనియా , అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ASI R. మను, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ J. ఉమేష్,R. రమేష్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అక్టోబర్ 25న  ఉత్తర్వులు  జారీ చేశారు.   గతంలో కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించిన సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై  విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు..  ఎస్పీ రిపోర్ట్ ఆధారంగా మల్టీ జోన్-1 ఐజి   ఉత్తర్వులు జారీ చేశారు.