రాఫెల్ ​యుద్ధ విమానాలు వచ్చేస్తున్నయ్

రాఫెల్ ​యుద్ధ విమానాలు వచ్చేస్తున్నయ్

జులై నెలాఖరులోగా చేరనున్న 4 ఎయిర్ క్రాఫ్ట్​లు

న్యూఢిల్లీ: రాఫెల్​ ఫైటర్​ ఎయిర్​ క్రాఫ్ట్​లు జులై నెలాఖరులోగా మన దేశానికి చేరనున్నాయి. ఫ్రాన్స్​ ప్రభుత్వంతో కుదిరిన డీల్​ లో భాగంగా తొలివిడత ఎయిర్​ క్రాఫ్ట్​లను అందుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే ఎయిర్​ క్రాఫ్ట్​లు దేశానికి రావాల్సింది.. అయితే, కరోనా కారణంగా మన దేశంతో పాటు ఫ్రాన్స్​ కూడా లాక్​ డౌన్​ విధించాయి. దీంతో ఎయిర్​ క్రాఫ్ట్​ల డెలివరీ లేటవుతోందని కంపెనీ వెల్లడించింది. ఈ యుద్ధవిమానాల రాకతో మన ఎయిర్​ ఫోర్స్ కు మరింత బలం చేకూరనుంది. ఇప్పుడు రానున్న ఎయిర్​ క్రాఫ్ట్​లలో మూడు ట్విన్​ సీటర్ ట్రైనర్​ ఎయిర్​ క్రాఫ్ట్​ లతో పాటు ఒక సింగిల్​ సీటర్​ ఫైటర్ కూడా ఉందని, ఈ నాలుగు విమానాలు జులై నెలాఖరులోగా అంబాలా ఎయిర్​ బేస్​ లో దిగుతాయని తెలిపింది.

ఫ్రాన్స్​తో రాఫెల్​ డీల్​ కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఎయిర్​ ఫోర్స్​ చీఫ్​ గౌరవార్థం ఈ విమానాలకు ఆర్​బీ సిరీస్​ లోని నెంబర్లు కేటాయించనున్నట్లు సమాచారం. ఫ్రాన్స్ నుంచి బయలుదేరే ఈ యుద్ధ విమానాలు మధ్యలో మిడిల్​ ఈస్ట్​ దేశాల్లో ఆగుతాయని, ఆలోపే ఫ్రాన్స్ ట్యాంకర్లు​ ఒకసారి వీటిలో ఫ్యూయెల్ నింపుతాయట. మిడిల్​ ఈస్ట్​ దేశాల నుంచి మన దేశానికి చేరుతాయని, ఈ మధ్యలో మన ఎయిర్​ ఫోర్స్ ట్యాంకర్​ విమానాలు గాల్లోనే వాటికి ఫ్యూయెల్ నింపుతాయని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ నుంచి ఈ విమానాలు నేరుగా మన దేశానికి రావొచ్చు.. కానీ సింగిల్​ సీటర్​ కెపాసిటీ కావడంతో కాక్​ పిట్​లో ఏకధాటిగా 10 గంటలపాటు కూర్చోవడం కష్టమని ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పైలట్ల ట్రైనింగ్​ కూడా అయిపోయిందని సమాచారం. ఎయిర్​ టు ఎయిర్, ఎయిర్​ టు గ్రౌండ్​ స్ట్రైక్ ల విషయంలో చైనా, పాక్​లలోని ఎయిర్​ క్రాఫ్ట్​ల కన్నా రాఫెల్​ ఎయిర్​ క్రాఫ్ట్​ల కెపాసిటీ ఎక్కువని ఎయిర్​ ఫోర్స్ అధికారులు చెప్పారు.

రాఫెల్​ డీల్ : 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఫ్రాన్స్ 36 ఎయిర్​ రాఫ్ట్​లను రూ.60 వేల కోట్లతో కొనుగోలు చేసింది. ఈ డీల్​ప్రకారం.. 2020 మే చివరిలోగా నాలుగు ఎయిర్​ క్రాఫ్ట్​లు డెలివరీ ఇవ్వాల్సింది. లాక్ డౌన్​ ఎఫెక్ట్​తో ఈ ఎయిర్​ క్రాఫ్ట్ లు దేశానికి రావడం ఆలస్యమైంది.

ఎయిర్​ క్రాఫ్ట్​ల పేరు : రాఫెల్​ ఫైటర్​ ఎయిర్​ క్రాఫ్ట్
ఇప్పుడుఎన్ని వస్తున్నయ్ : నాలుగు
జెట్ ల వివరాలు : మూడు ట్విన్​ సీటర్లు, ఒక సింగిల్​ సీటర్
ఎక్కడి వస్తున్నయ్​ : అంబాలా ఎయిర్​ బేస్​
ఎప్పుడు : జులై నెలాఖరులోగా
తొలి ప్రయాణం : 17 గోల్డెన్ యారోస్​ కమాండింగ్​ ఆఫీసర్..