హస్నాపూర్, జైనథ్​ మండలంలో నాలుగు పథకాలకు శ్రీకారం

 హస్నాపూర్, జైనథ్​ మండలంలో నాలుగు పథకాలకు శ్రీకారం

నెట్​వర్క్  వెలుగు : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను గ్రామాలు, వార్డుల్లో ఘనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్​ జిల్లా తాంసి మండలంలోని హస్నాపూర్, జైనథ్​మండలంలోని పిప్పర్ వాడలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. 

జిల్లాలోని 17 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు నాలుగు ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. వాంకిడి మండలంలోని జైత్​పూర్​లో నాలుగు పథకాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి పత్రాలు అందజేశారు. పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.