జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్​లోని దోడాలో జూలై 15న రాత్రి ఉగ్రవాదులు,  భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి.  ఈ ఘటనలో  నలుగురు భారత జవాన్లు సహా ఓ ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. 

దోడా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో   భారత సైన్యం హెలికాప్టర్‌ను ఉపయోగించి దోడా అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అటవీ ప్రాంతంలోని ధారి గోటె ఉరర్బాగిలో రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్​, జమ్ముకశ్మీర్​ పోలీస్​ స్పెషల్​ ఆపరేషన్స్​ గ్రూప్​ గాలింపు చర్యలు చేపట్టింది. రాత్రి 9 గంటల తర్వాత    భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. 

ALSO READ : ట్రాక్టర్ను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..నలుగురు మృతి

ఈ ఘటనలో ఇటీవల పదోన్నతి పొందిన 10 ఆర్​ఆర్​కు చెందిన మేజర్ బ్రిజేష్ థప్పా సహా నలుగురు జవాన్లు ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని భారత సైన్యం ముందు  ఓ ప్రకటన చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ   ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఆపరేషన్ కొనసాగుతోందని భారత సైన్యం వెల్లడించింది.