నిర్మల్ జిల్లా: భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. అక్టోబర్ 22న చరణ్, రాకేష్, కేశవ్, ఈశ్వర్ అనే విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల మధ్య నిన్న రాత్రి గొడువ జరిగినట్లు హాస్టల్ లో సాటివిద్యార్థులు చెప్పారు. మార్నింగ్ అటెండెన్స్ టైంలో ఆ విషయం బయటకు వచ్చింది. భైంసా సీఐ గోపీనాథ్ చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడి, హాస్టల్ వార్డెన్ వాచ్మెన్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరించారు. పిల్లలు ఆచూకీ కోసం పోలీసుల చర్యలు చేపట్టారు.