ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెండ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు  ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్, రామరాజు వెంటనే జంగారెడ్డి గూడెం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద నినాదాలు చేశారు. ప్రతిపక్షాలు పోడియం వద్ద నిరసనలు తెలియజేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ స్థానాల వద్ద నుంచి నిరసన నినాదాలు కొనసాగించారు.

టీడీపీ సభ్యులు విజిల్స్ ఊదడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారని ఆశిస్తే .. సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి తప్పు మీరు సభకు సహకరిస్తే.. బాగుంటుంది.. ప్రతిసారి అల్లరి చేస్తామంటే సహించేది లేదంటూ నలుగురు టీడీపీ సభ్యులను మొత్తం సమావేశాలకు అంటే ఈనెల 25 వరకు సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించారు. 

ప్రశ్నోత్తరాలతో పదో రోజు అసెంబ్లీ సమావేశాలు 

ప్రశ్నోత్తరాలతో పదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అయ్యాయి. ఫైబర్‌గ్రిడ్‌ అవినీతి, పెగాసస్ స్పైవేర్ కూడా పెద్ద స్కాం అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. నిబంధనలు పాటించకుండా ఫైబర్ గ్రిడ్ టెండర్లు ఇచ్చారని ఆయన ఆరోపించగా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఒకరోజు ముందు టెరా సాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారని, ఈ కంపెనీ యజమాని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో విచారణ జరుగుతోందని.. అవినీతి వెనుక ఎంత పెద్దవారున్నా శిక్ష తప్పదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

 

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

రాత్రిపూట యువకుడి పరుగుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా

యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్