తెలుగుగంగ నుండి 4వేల క్యూసెక్కులు విడుదల

తెలుగుగంగ నుండి 4వేల క్యూసెక్కులు విడుదల

కర్నూలు: జిల్లాలోని వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగుగంగ బ్యారేజీ నుండి నీటి విడుదల ప్రారంభమైంది. కృష్ణా నదికి వరద కొనసాగుతుండడంతో పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమ కాలువల కింద నిర్మించిన ప్రాజెక్టులకు నీటి విడుదల జరుగుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వెలుగోడు బ్యారేజీ సగానికి పైగా నిండిపోయింది. వెలుగోడు రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.619 టీఎంసీలకు చేరింది. పోతిరెడ్డిపాడుకు దిగువన బానకచెర్ల నుండి 6 వేల క్యూసెక్కులు.. గాలేరు నుండి 150 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. రానున్న రోజుల్లో వర్షాలు మరింత కురుస్తాయని… కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగే అవకాశం ఉందని అధికారుల అంచనా.

          ఈ ప్రాజెక్టు కాలువల కింద సాగు చేస్తున్న ఇతర పంటల సాగు అవసరాల కోసం తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ నుండి నీటి విడుదలను  ఎమ్మెల్యే శిల్పా చక్ర పాణి రెడ్డి  ప్రారంభించారు.  జలాశయం గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని   విడుదల చేశారు.  కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సుబ్బారాయుడువైస్సార్సీపీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ ఇలియాజ్, మండ్ల శంకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ బళ్లాని సత్యమయ్యా,బండి ఆత్మకూరు మండలం వైస్సార్సీపీ  అధ్యక్షులు  భోదనం శ్రీను, ముడిమేల పుల్లారెడ్డి పాల్గొన్నారు.