ఆదిలాబాద్ జిల్లాలో 9మందిపై పడ్డ పిడుగు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో 9మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా..హఠాత్తుగా పెద్ద ఉరుముతో పిడుగు పడింది. సరిగ్గా పనులు చేసుకుంటున్న వారికి దగ్గర్లో పిడుగు పడింది.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి వద్ద పొలంలో 9మంది పనులు చేసుకుంటుండగా పెద్ద శబ్దంతో ఉరుముతూ పిడుగు పడింది. పనులు చేసుకుంటున్న వారికి చాలా దగ్గరగా పిడుగుపడడంతో..  నలుగురు మహిళలు కాలినగాయాలతో కుప్పకూలిపోయారు. నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన రిమ్స్ కి తరలించారు. పిడుగుపాటుకు గురైన వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.