
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పుడియంపుత్తూరులో జరిగింది. ఓ వ్యాన్ సుమారు 15 మంది కార్మికులను ఎక్కించుకొని ఓ పారిశ్రామిక ఎస్టేట్‌కు వెళ్లేందుకు తూత్తుకుడి వైపు బయలుదేరింది. ఇదే సమయంలో తూత్తుకుడి నుంచి పుతియంపుత్తూరుకు వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దెబ్బతింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.