కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి

కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి

కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. శనివారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 సమయంలో షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు షోరనూర్ వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చెత్తను తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సిబ్బంది ట్రాక్‌కి ఇరువైపులా చెత్తను తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శుభ్రపరుస్తున్న  ట్రాక్‌‌పైనే రైలు వెళ్తుందని వారు ఊహించలేదని, ట్రైన్ వేగంగా దూసుకురావడంతో తప్పించుకోలేకపోయారని వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిని తమిళనాడులోని సేలంకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా, నాలుగో వ్యక్తి మృతదేహం నదిలో పడిపోయింది. దాన్ని వెలికితీసేందుకు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.