ఆళ్లపల్లి, వెలుగు : ట్రాక్టర్ కింద పడి నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలంలోని అనంతవు గ్రామానికి చెందిన గలిగా సురేశ్, కృష్ణవేణి దంపతులకు కిరణ్య (4) పెద్ద కుమార్తె. బుధవారం చిన్నారి నానమ్మ మొక్కజొన్న చేనులో విరిచిన కంకులను ఒక్కచోట చేర్చేందుకు కూలీలతో కలిసి ట్రాక్టర్‌లో వెళ్తుండగా కిరణ్య కూడా ఆమెతో వెళ్లింది.
ట్రాక్టర్‌లో బస్తాలు లోడ్ చేసిన తర్వాత ట్రాక్టర్‌ను ముందుకు కదిలించడంతో డ్రైవర్ పక్కన కూర్చున్న కిరణ్య ఒక్కసారిగా కిందపడింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ టైర్ చిన్నారి తల పైనుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.