
వికారాబాద్ జిల్లా జిల్కచర్ల మండలం అల్లాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకం దిమ్మె కూలి మీద పడటంతో 4 ఏళ్ళ చిన్నారి విస్లావత్ సాయి మృతి చెందాడు. అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి ఆవరణలో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
దిమ్మె చిన్నారిపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. చిన్నారి మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు.