
జ్వరంతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని తుమ్మిడి హెట్టి గ్రామంలో ఆధ్య శ్రీ అనే చిన్నారి జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు.. ఓ ఆర్ఎంపి డాక్టర్ వద్ద చూపించారు.
అయితే, చిన్నారి చికిత్స పొందుతూ మరణించడంతో.. ఆర్ఎంపి డాక్టర్ చేసిన వైద్యం వికటించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.