గుండె అంటే ఏంటీ.. ఆ గుండె ఎలా పని చేస్తుంది.. అసలు గుండెపోటు అంటే ఏంటీ అనేది కూడా ఆ చిన్నారికి తెలియదు.. ఇంకా అ.. ఆ.. లు కూడా నేర్వలేదు.. అసలు స్కూల్ కు వెళ్లే వయస్సు కూడా కాదు.. బుడిబుడి అడుగులతో ఇంట్లో అల్లారుముద్దుగా తిరిగే వయస్సు.. అలాంటి చిన్నారి గుండెపోటుతో చనిపోయింది.. Yes.. అవును.. ఇది పచ్చి నిజం.. నాలుగేళ్ల చిన్నారికి గుండెపోటు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగింది.. డాక్టర్లు అలాగే చెప్పారు.. మనసు కదిలించే.. ఎవరూ నమ్మలేని నిజంగా ఉన్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
నవంబర్ 18న ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుర్రా వినోద్,లావణ్య దంపతుల కూతురు హర్షిత (4) సాయంత్రం సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది. ఆడుకుంటూ ఒకేసారి చాతిలో నొప్పి అంటు కుప్పకూలి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. గుండె పోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపినట్లు స్థానికులు తెలిపారు.
అల్లారుముద్దుగా అడుతూ, పాడుతూ ఉండే ఒక్కగానొక్క కూతురు హఠాత్తుగా కండ్లముందే మృతిచెందడంతో చిన్నారి తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.