కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సుమారు 2.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న సంతోష్ గౌడ్, నరేష్ గౌడ్, మల్లికార్జున గౌడ్, దత్తాద్రి గౌడ్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి ఓ కారు,4 సెల్ ఫోన్లు, రూ.37-వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.