నాలుగో రోజూ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతం

నాలుగో రోజూ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నాల్గో రోజు ప్రశాంతంగా ముగిశాయి. మూడు జిల్లాల పరిధిలోని 46 సెంటర్లలో ‘ఇండియన్ సొసైటీ, కాన్ స్టిట్యూషన్, గవర్నెన్స్’ పేపర్ కు 31,403 మందికి గానూ.. 21,264 మంది అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ ఈ.నవీన్ నికోలస్ చెప్పారు. కాగా.. పేపర్​లో  దేశంలో పట్టణ ప్రాంతాల్లో కులం తగ్గుతుందా.?  జాతీయ విద్యావిధానం దేశ అవసరాలకు ఉపయోగపడు తుందా? లౌకిక వాదం నమూనాలు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, డిజిటల్ హెల్త్ మిషన్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం

సామాజిక న్యాయం కోసం సంక్షేమ పథకాలు, అంతర్ రాష్ట్ర జల వివాదాలు, భారత రాజ్యాంగం, రాజ్యాంగంలోని 21వ ప్రకరణ.. ప్రాథమిక హక్కుల పరిధి , సీఎస్​ఆర్, జాతీయ ఆహార భద్రత చట్టం.. తదితర అంశాలపై క్వశ్చన్లు వచ్చాయి. అయితే, గ్రూప్ 1 పరీక్షకు అటెండ్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది.  తొలిరోజు సోమవారం జరిగిన క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు 72.4 శాతం మంది అటెండ్ కాగా, గురువారం 67.7శాతానికి తగ్గారు.