డిజిటల్ మీడియా వ్యాప్తికోసం ఇ-కాన్‌క్లేవ్‌

సోషల్ మీడియా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో.. సోషల్ మీడియా వ్యాప్తిని పెంచేందుకు గాను త్వరలోనే ఇ-కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తామని ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ తెలిపింది. ఈ ఇ-కాన్‌క్లేవ్‌ను డిసెంబర్ 10,2020న నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చెన్నైకి చెందిన ఈ ఔట్‌సోర్సింగ్ మీడియా సంస్థ జాతీయ ఉనికిని కలిగి ఉంది. ఈ సంస్థ చెన్నై, ముంబై మరియు ఢిల్లీలలో తమ కార్యాలయాలను కలిగి ఉంది. ఈ సంస్థ టెలివిజన్, రేడియో మరియు మ్యాగజైన్లలోనే కాకుండా అవుట్ డోర్, కేబుల్, డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్‌లలో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది.

సౌత్ ఇండియన్ మీడియా సమ్మిట్ (2018 & 2019) వంటి కార్యక్రమాలను కూడా ఫోర్త్ డైమెన్షన్‌ నిర్వహించింది. అదేవిధంగా మొబైల్ మరియు డిజిటల్ మీడియా కాన్‌క్లేవ్ 2019 కార్యక్రమాన్ని కోయంబత్తూరులో నిర్వహించింది. అంతేకాకుండా తమిళనాడులోని మదురైలో మీడియా ల్యాండ్‌స్కేప్ కూడా నిర్వహించింది. ఈ సంస్థ ఇ-కాన్‌క్లేవ్స్‌పై కూడా దృష్టిపెట్టి గొప్ప విజయాన్ని సాధించింది. సంస్థ యొక్క నిరంతర ప్రాజెక్టులకు భారీ స్పందన రావడంతో.. సంస్థ ప్రతినిధులు తమ తదుపరి ఇ-కాన్‌క్లేవ్‌ను డిసెంబర్ 10,2020 న ‘డీకోడింగ్ మొబైల్ మరియు డిజిటల్ ఇన్ సౌత్ ఇండియా’ పేరుతో నిర్వహించాలని నిర్ణయించారు.

గతంలో నిర్వహించిన ఇ-కాన్‌క్లేవ్‌ల మాదిరిగానే ఈసారి కూడా సాధారణ ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఏయే అంశాలపై చర్చలు నిర్వహించాలో ఆ అంశాలను మాత్రమే డిబెట్‌లో చర్చిస్తారు. దక్షిణ భారతదేశం ఎల్లప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా మొబైల్ & డిజిటల్ మీడియా కూడా ఒకటి కావడం గమనార్హం.

డిజిటల్ మీడియాకు చెందిన నిపుణులు ఈ డిబెట్‌లలో పాల్గొని పలు అంశాల మీద వివరంగా చర్చిస్తారు. ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ (పి) లిమిటెడ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్ మాట్లాడుతూ, ‘మా దృష్టి ఎల్లప్పుడూ దక్షిణ భారతదేశంపైనే ఉంది. మేం మొబైల్ మరియు డిజిటల్ యూజర్ల అలవాట్లను లోతుగా పరిశోధించాలనుకుంటున్నాము. దక్షిణాదిలోని క్లయింట్లు మరియు బ్రాండ్లు గత కొన్ని సంవత్సరాలుగా కొందరి వద్దే ఉంటున్నాయి. వాటిని మేం అందుకోవాలని అనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.

Decoding Mobile and Digital in South India

For More News..

రేప్ చేస్తే అది పనిచేయకుండా శిక్ష

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

బిజీగా ఉన్న మార్కెట్‌లో బాంబు దాడి.. 17 మంది మృతి