తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌కు నాలుగో ర్యాంకు

తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌కు నాలుగో ర్యాంకు

న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. ఫిడే ర్యాంకింగ్స్‌‌లో నాలుగో ప్లేస్‌‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో అర్జున్‌‌ 2801 ఎలో రేటింగ్‌‌ పాయింట్లను సాధించాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌ కూడా 2783 రేటింగ్‌‌ పాయింట్లతో ఐదో ప్లేస్‌‌లోనే కొనసాగున్నాడు. 

మాగ్నస్‌‌ కార్ల్‌‌సన్‌‌ (2831) టాప్‌‌ ర్యాంక్‌‌లో ఉన్నాడు. అమెరికా ద్వయం ఫ్యాబియానో కరువాన (2803), హికరు నకమురా (2802) వరుసగా రెండు, మూడో ర్యాంక్‌‌ల్లో నిలిచారు. విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌ (2750) పదో ర్యాంక్‌‌లో ఉండగా, ఆర్‌‌. ప్రజ్ఞానంద (13), అరవింద్‌‌ చిదంబరం (23), విదిత్‌‌ గుజరాతీ (24), పెంటేల హరికృష్ణ (36), నిహల్‌‌ సరీన్‌‌ (41), రౌనక్‌‌ సాద్వానీ (48) టాప్‌‌–50లో కొనసాగుతున్నారు.

 విమెన్స్‌‌ సెక్షన్‌‌లో వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌ చెస్‌‌ చాంపియన్‌‌ కోనేరు హంపి 2523 ఎలో రేటింగ్‌‌ పాయింట్లతో ఆరో ర్యాంక్‌‌లో ఉంది. వరల్డ్‌‌ మాజీ చాంపియన్‌‌ హోయు యిఫాన్‌‌ (2633), జు వెన్‌‌జున్‌‌ (2561), టాన్‌‌ జోంగోయి (2561), లీ టిన్‌‌జీ (2552) వరుసగా రెండు నుంచి నాలుగో ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. ఇండియా నుంచి దివ్యా దేశ్‌‌ముఖ్‌‌ (2490), ద్రోణవల్లి హారిక (2489) వరుసగా 14, 16వ ర్యాంక్‌‌ల్లో నిలిచారు. ఆర్‌‌. వైశాలి 2476 పాయింట్లతో 19వ ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది.