గ్రామస్థులపై నక్క దాడి.. ముగ్గురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నలుగురి వ్యక్తులపై నక్క దాడి చేసింది. ఉదయం ఇంటి ముందు పని చేస్తున్న రాధ అనే మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 

ఆమెతో పాటు మరికొందరిపై దాడి చేసింది. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. దాడి చేసిన నక్కను కొట్టి చంపారు గ్రామస్తులు.పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి  ఆహారం కోసం  నక్క గ్రామంలోకి వచ్చినట్టు చెప్తున్నారు గ్రామస్తులు.