పెళ్లైన మహిళలకు ఉద్యోగాలు ఇవ్వం : ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీలో వింత రూల్

పెళ్లైన మహిళలకు ఉద్యోగాలు ఇవ్వం : ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీలో వింత రూల్

ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా.. మన దేశంలోని ఓ కంపెనీ పెట్టిన రూల్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏంటా రూలు అంటారా.. పెళ్లయిన మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరు.. పెళ్లి కాకుండా ఉద్యోగంలో చేరిన తర్వాత.. పెళ్లి చేసుకున్న మహిళలను ఉద్యోగం నుంచి తీసి వేయటం.. అవును మీరు చదవింది అక్షరాల నిజం.. కర్నాటక రాష్ట్రంలో.. తమిళనాడు సరిహద్దుల్లో ఐ ఫోన్లను తయారు చేసే  ఫాక్స్‌కాన్ కంపెనీలోని రూల్ ఇది. రెండేళ్లుగా ఇలాంటి విధానం అమలు అవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకురావటం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ  ఫాక్స్‌కాన్ శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో యాపిల్ ఫోన్స్ అసెంబుల్ చేస్తుంది. ఆ కంపెనీలో గత కొన్ని రోజులుగా పెళ్లైన మహిళలను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. అంతేకాదు.. పెళ్లి అయిన మహిళలకు జాబ్ ఇవ్వమని కంపెనీ హైయిరింగ్ రూల్స్ లో కూడా చేర్చారు. ఈ విషయంపై కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. పని కల్పించే విషయంలో లింగ వివక్ష చూపించవద్దని సమాన వేతన చట్టం 1976 గుర్తించి ప్రస్తావించింది. కానీ ఇక్కడ ఇలా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

 ఫాక్స్‌కాన్ కంపెనీ రూల్స్ పై వివరణ ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.  ఫాక్స్‌కాన్ కంపెనీ కూడా ఏం చెప్పలేదు.  ఈ విషయంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కలుగజేసుకున్నాక.. ఐ ఫోన్ల తయారీ ప్లాంట్ వివాహితలను జాబ్స్ లో ఉంచుకోకపోవడానికి కారణం తెలిపింది. మహిళలు పెళ్లైన తర్వాత ఫ్యామిలీ పనులు, గర్భధరణ (మెటర్నటీ లీవ్స్) కారణంగా సెలువులు ఎక్కువగా పెడుతున్నారట.. దీంతో కంపెనీ ఉత్పాదక తగ్గతుందని పెళ్లైన మహిళలను జాబ్స్ నుంచి తీసేస్తోంది. జాబ్ హైరింగ్ విషయంలో తామ ఎలాంటి వివక్ష పాటించట్లేదని ఫాక్స్ కాన్ సంస్థ చెప్పింది.