న్యూఢిల్లీ: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) తయారీ ప్లాంట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయాలని తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్న ఈ కంపెనీ, ఇప్పటికే తైవాన్‌లో బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.
‘మా 3+3 ఫ్యూచర్ ఇండస్ట్రీని ఇండియాలో ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. తమిళనాడులో బీఈఎస్‌ఎస్ ప్లాంట్ పెట్టడంపై ఇక్కడి మంత్రులతో చర్చలు జరుపుతున్నాం’ అని కంపెనీ చైర్మన్ యంగ్ లియు అన్నారు. కాగా, 3+3 స్ట్రాటజీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటల్ హెల్త్, రోబోటిక్స్ ఇండస్ట్రీస్‌పై ఫాక్స్‌కాన్ ఫోకస్ పెట్టింది. కంపెనీ బీఈఎస్ఎస్ ప్లాంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కేటగిరీ కిందకు వస్తుంది. ఈవీల తయారీని త్వరలో చేపడతామని లియు అన్నారు. కాగా, ఫాక్స్‌కాన్ ఇప్పటి వరకు ఇండియాలో సుమారు రూ.83 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది.