ఫ్రాన్స్లో లెఫ్ట్ పార్టీల విజయం.. ఎవరూ ఊహించని తీర్పు

ఫ్రాన్స్లో లెఫ్ట్ పార్టీల విజయం.. ఎవరూ ఊహించని తీర్పు

ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో లెఫ్ట్ ఫార్టీలు పుంచుకున్నాయి. సోమవారం (జూలై 8) వెలువడిన ఫలితాల ప్రకారం.. వామ పక్ష కూటమి 180 సీట్లు గెలిచింది. మాక్రాన్ కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 

577 స్థానాలున్న ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో అధికారం చెపట్టాలంటే ఏ పార్టీ అయిన 289 స్థానాల్లో విజయం సాధించాలి. అతి మితవాద కూటమి   140 స్థానాల్లో విజయం సాధించి థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ సారి అతి మితవాద పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు అవకాశం ఉంది. ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి హంగ్ తప్పేలా లేదని  తెలుస్తోంది. 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ పార్టీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ రాలేదు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతదోంది. తుది ఫలితాలు వచ్చే వరకు వేచి చూసిన తర్వాత తుది నిర్ణయం  ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తీసుకుంటారని ఎలీసీ ప్యాలెస్ ప్రకటించింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియోల్ అట్టల్ తన పదవికి రిజైన్ చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు.