ఫ్రాన్స్ కొత్త ప్రధాని గామిచెల్ బార్నియర్

ఫ్రాన్స్ కొత్త ప్రధాని గామిచెల్ బార్నియర్

పారిస్: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ (73) నియమితులయ్యారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రధానిగా బార్నియర్‎ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బార్నియర్ గతంలో యూరోపియన్ యూనియన్ చీఫ్‪గా పని చేశారు. బ్రెగ్జిట్ సంధానకర్తగా వ్యవహరించారు. బార్నియర్ నియామకం సందర్భంగా మెక్రాన్ ఆఫీస్ ఓ ప్రకటనను జారీ చేసింది. దేశానికి, ఫ్రాన్స్‪కు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత బార్నియర్కు ఉందని ఆ ప్రకటనలో తెలిపింది. బార్నియర్కు 50 ఏండ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఫ్రెంచ్ ప్రభుత్వంలో విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాలు, ఎన్విరాన్ మెంట్, అగ్రికల్చర్ మినిస్టర్ గా పని చేశారు. రెండు సార్లు యూరోపియన్ యూనియన్ కమిషనర్ గా వ్యవహరించారు.