Epic Victory Cricket League: 6 జట్లు, 18 మ్యాచ్‌‌‌‌లు.. భారత క్రికెట్‌‌‌‌లో మరో కొత్త లీగ్‌

Epic Victory Cricket League: 6 జట్లు, 18 మ్యాచ్‌‌‌‌లు.. భారత క్రికెట్‌‌‌‌లో మరో కొత్త లీగ్‌

న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్‌‌‌‌లో మరో కొత్త లీగ్‌‌‌‌కు అంకురార్పణ జరుగుతోంది. తాజాగా రిటైర్డ్‌‌‌‌ రంజీ ప్లేయర్ల కోసం ఎపిక్‌‌‌‌ విక్టరీ క్రికెట్‌‌‌‌ లీగ్‌(Epic Victory Cricket League )‌‌‌ను రూపొందిస్తున్నారు. ఫ్రాంచైజీ తరహాలోనే ఉండే ఈ లీగ్‌‌‌‌కు టీమిండియా మాజీ పేసర్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్‌ను మెంటార్‌‌‌‌గా నియమిస్తున్నారు. జూన్‌‌‌‌ లేదా జులైలో జరిగే ఈ టోర్నీలో ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. మొత్తం 18 మ్యాచ్‌‌‌‌లు జరుగుతాయి. 

‘రంజీ ప్లేయర్ల సహకారాన్ని గుర్తిస్తున్నందుకు ఎపిక్‌‌‌‌ లీగ్‌‌‌‌కు నా మద్దతు తెలుపుతున్నా. కెరీర్‌‌‌‌లో రంజీ ప్లేయర్లకు పెద్దగా గుర్తింపు రావడం లేదు. ఇప్పుడు ఈ లీగ్‌‌‌‌ ద్వారా వారికి మంచి క్రెడిట్‌‌‌‌ వస్తుందని భావిస్తున్నా. ఆటతోపాటు కొంత సంపాదనను తిరిగి పొందడానికి ఈ లీగ్‌‌‌‌ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని ప్రవీణ్‌‌‌‌ పేర్కొన్నాడు. త్వరలోనే ప్లేయర్ల రిజిస్ట్రేషన్‌‌‌‌ మొదలవుతుందని వెల్లడించాడు.