హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐడెన్ మార్‌క్రమ్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను తమ నాయకుడిగా ఎంపిక చేసినట్టు సన్‌రైజర్స్ సోమవారం ప్రకటించింది. 30 ఏండ్ల కమిన్స్‌ను గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ లీగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, గత మూడేళ్లుగా సన్‌రైజర్స్ నాయకత్వంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి.
2021లో వార్నర్‌ను తప్పించి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించిన ఫ్రాంచైజీ గతేడాది మార్‌క్రమ్‌ను కెప్టెన్ చేసింది. అయితే, మార్‌క్రమ్ కెప్టెన్సీలో గత సీజన్‌లో సన్‌రైజర్స్ చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో నాలుగే గెలిచింది. తాజాగా అతని స్థానంలో కమిన్స్ ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక, వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమైన డేల్ స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను సన్ రైజర్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది