ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా రిటర్న్‌‌

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా రిటర్న్‌‌

న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం ఇండియా నుంచి వెళ్లిపోయిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్  ఇండియా డెట్ మార్కెట్‌‌‌‌లోకి  రీఎంట్రీ ఇచ్చింది. కొత్త షార్ట్‌‌‌‌టెర్మ్‌‌‌‌  డెట్ ఫండ్‌‌‌‌ను  ఆగస్టు 19 నుంచి ఆగస్టు 28 మధ్య ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచనుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్  ఇండియా చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్  రాహుల్ గోస్వామి, పోర్టుఫోలియో మేనేజర్‌‌‌‌ పల్లబ్‌‌‌‌ రాయ్‌‌‌‌ ఈ ఫండ్‌‌‌‌ను  నిర్వహిస్తారు. 

కాగా, ఫ్రాంక్లిన్‌‌‌‌ టెంపుల్టన్ 2020 ఏప్రిల్‌‌‌‌లో ఆరు ఫండ్స్‌‌‌‌ను మూసేసి, ఇన్వెస్టర్ల డబ్బులను తిరిగిచ్చేసి, ఇండియాలో ఆఫీసులను క్లోజ్ చేసుకుంది. తాజాగా ఇండియా క్రెడిట్ రేటింగ్ మెరుగుపడడంతో పాటు బ్యాంక్‌‌‌‌ల మొండిబాకీలు కొన్నేళ్ల కనిష్టాలకు తగ్గడంతో మళ్లీ ఇండియాకు రావాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త  డెట్‌‌‌‌ ఫండ్ తక్కువ రిస్క్ ఉండే  కార్పొరేట్ బాండ్లు, సర్టిఫికెట్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ట్రెజరీ బిల్లులు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది  షార్ట్ టెర్మ్‌‌‌‌ ఫండ్ అని, మెచ్యూరిటీ డేట్ ఒకటి  నుంచి ఆరు నెలల మధ్య ఉంటుందని తెలిపింది.

మరిన్ని వార్తలు