మంచిర్యాలలో నకిలీ కంటి డాక్టర్లు.. టీజీఎంసీ టాస్క్​ఫోర్స్ ​తనిఖీలతో వెలుగులోకి..

మంచిర్యాలలో నకిలీ కంటి డాక్టర్లు.. టీజీఎంసీ టాస్క్​ఫోర్స్ ​తనిఖీలతో వెలుగులోకి..

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం లో నకిలీ కంటి డాక్టర్ల దందాను తెలంగాణ మెడికల్​కౌన్సిల్​(టీజీఎంసీ) టాస్క్​​ ఫోర్స్​ టీమ్​బట్టబయలు చేసింది. టీజీఎంసీ ఎథికల్​కమిటీకి ఫిర్యాదు మేరకు గురువారం నైనా ఆప్టికల్, ఓల్డ్ నైనా ఆప్టికల్, శ్రీవెంకటేశ్వర ఆప్టికల్స్​లో  టాస్క్​ఫోర్స్​టీమ్​తనిఖీ చేసింది. 

ఆప్టికల్స్​నిర్వాహకులకు ఎలాంటి అర్హతలు లేకున్నా కంటి డాక్టర్లుగా చెప్పుకుంటూ ట్రీట్​మెంట్​చేస్తున్నట్టు తేలింది. ట్రీట్​మెంట్​కారణంగా వారం కింద ఒక పేషెంట్​కు చూపుపోయే పరిస్థితి వచ్చిందని.. హైదరాబాద్​లో చికిత్స తీసుకుంటున్నాడని టీజీఎంసీ, ఎథికల్​కమిటీ మెంబర్​డాక్టర్​యెగ్గెన శ్రీనివాస్​తెలిపారు.

కంటి డాక్టర్ల వద్ద అసిస్టెంట్​గా పనిచేయడానికి ట్రీట్​మెంట్ ​చేసే అర్హత, నైపుణ్యం లేదని చెప్పారు.  ఆప్రొమెట్రిస్టులు కంటి వైద్యం చేయడం నేషనల్​మెడికల్​కమిషన్​సెక్షన్స్​34, 54 ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు.  నకిలీ డాక్టర్లను నమ్మవద్దని,  అలాంటివారిపై 7557555777 కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో డాక్టర్​కేవీఎల్​ఎన్​.మూర్తి, డాక్టర్​ అనిల్​, సిబ్బంది పాల్గొన్నారు.