
చీట్చేసిన తమిళనాడులోని కన్సల్టెన్సీ
ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు
బాధితుల సంఖ్య 200కుపైనే..
ఎంపీ అర్వింద్ ధర్మపురిని కలిసిన నిరుద్యోగులు
నిజామాబాద్, వెలుగు : నిరుద్యోగ యువకులను విదేశాల్లో ఉద్యోగాల పేరిట తమిళనాడులోని ఓ ప్రైవేట్ జాబ్ కన్సల్టెన్సీ మోసం చేసింది. నిజామాబాద్ పార్లమెంట్సెగ్మెంట్పరిధిలోని సుమారు 200 మంది యువకుల నుంచి రూ. 12 కోట్లు వసూలు చేసి విదేశాలకు పంపకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. తమిళనాడులోని సేలం నగరానికి చెందిన యూరో నెక్సెస్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ.. బ్రిటీష్ ఓవర్సీస్ యూకేలోని కెమన్ ఐల్యాండ్‌లో ఉన్న ప్రైవేట్ హోటల్లో క్లీనర్, వెయిటర్ ఉద్యోగాలు పెట్టిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 6 లక్షలు తీసుకుంది. నెలకు సుమారు రూ. 40 వేల నుంచి 60 వేలు జీతం వస్తుందని నమ్మబలికారు. ఇలా సుమారు రూ.12 కోట్లు తీసుకున్నారు. జనవరి 24న వీసాలు కూడా పంపించారు. అయితే టికెట్కన్ఫమ్ చేయకుండా వేధిస్తున్నారు. సాధారణంగా వీసా గడువు ఏడు నెలల్లోనే ముగుస్తుంది. ఈ లెక్కన జులై 24వ తేదీతో కాలపరిమితి ముగియబోతోంది.
ఎంపీ అర్వింద్‌ను కలిసిన బాధితులు
మోసపోయిన వారంతా ఆదివారం నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ ధర్మపురిని కలిశారు. ఎంపీ ఆఫీసులో కలిసి గోడు వెల్లబోసుకున్నారు. నెలకు రూ.40 వేలు వస్తుందని చెబితే నమ్మి, ఒక్కొక్కరం రూ.6 లక్షలు ఇచ్చామని, ఎప్పుడు ఫోన్‌చేసినా పనై పోతుందని తప్పించుకుంటున్నారన్నారు.
ఎన్ఆర్ఐ సెల్ఎక్కడుంది?
ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సెల్ ఎక్కడుందో సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత జవాబు చెప్పాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ. 500 కోట్లు కేటాయించి ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. వర్క్ వీసా ఏడు నెలల తర్వాత ఎక్స్పైరీ అవుతుందని, మోసపోయిన నిరుద్యోగులకు తండ్రీకూతుళ్లు సమాధానం