ఆదిలాబాద్ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియురాలిని మోసం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్పెషల్ కోర్టు. ప్రేమిస్తున్నాని నమ్మించి అత్యాచారం చేసిన నిందితునికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధించింది. దీనిపై బుధవారం విచారణ జరిపగా జిల్లా 6వ అదనపు సెషన్స్ జడ్జి ఈ సంచలన తీర్పు వెలువరించారు.
గుడిహత్నూర్ మం. మల్కాపూర్ కి చెందిన కుమ్ర మారుతి (30) గిరిజన యువతి(23)తో చనువుగా ఉండేవాడు. ప్రేమిస్తున్నట్లు నమ్మించి, 2016లో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి తప్పించుకు తిరిగాడు. గర్భవతి అయిన యువతికి ఆడబిడ్డ పుట్టడంతో అప్పట్లో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుట్టిన బిడ్డకు DNA పరీక్షలు చేయడంతో మారుతికి బుధవారం శిక్ష ఖరారు చేసింది కోర్టు.