![పీఎంఈజీపీ స్కీం పేరుతో మోసం](https://static.v6velugu.com/uploads/2025/02/fraud-in-the-name-of-pmegp-scheme-in-jagtial-district_FBc1yifWj0.jpg)
జగిత్యాల టౌన్, వెలుగు : ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో ఓ వ్యక్తి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన కొడిచర్ల వేణు వర్మ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంధువుల ద్వారా పీఎంఈజీపీ స్కీం కింద లోన్లు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు.
ఇలా నాలుగేండ్లుగా సుమారు 80 మంది వద్ద రూ.2.96 కోట్లు వసూలు చేశాడు. అయితే లోన్లు ఇప్పించకపోవడం, తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.