వడ్ల తూకంలో మోసం! కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

వడ్ల తూకంలో మోసం! కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

దహెగాం, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వేయింగ్  మెషీన్ లో బరువు తక్కువ చూపేలా సెట్  చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లా దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు సెంటర్  వద్ద వేయింగ్​ మెషీన్​లో బస్తాను కాంటా చేయగా, మొదట 41 కిలోలు వచ్చింది. అనుమానించిన రైతులు.. కాంటాను సెట్​ చేసి మళ్లీ జోకగా, అదే బస్తా 42 కిలోలు వచ్చింది.

దీంతో సెంటర్  నిర్వాహకులను రైతులు నిలదీశారు. కాంటాలో సెట్టింగ్  మార్చి కేజీ తక్కువగా చూపించేలా చేశారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని సెంటర్  వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సెంటర్ లో వడ్ల కాంటాలో తేడాలు ఉన్నట్లు, గతంలో వడ్లు అమ్మిన రైతులు సైతం ఆరోపించారు. ప్రైవేట్​ వ్యాపారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్​కు తీసుకొస్తే ఇలా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.