పెట్టుబడికి డబుల్‌‌‌‌ ఇస్తానంటూ మోసం.. 200 మంది వద్ద సుమారు రూ. 50 కోట్లు వసూలు

పెట్టుబడికి డబుల్‌‌‌‌ ఇస్తానంటూ మోసం.. 200 మంది వద్ద సుమారు రూ. 50 కోట్లు వసూలు
  • 200 మంది వద్ద సుమారు రూ. 50 కోట్లు వసూలు
  • ఏడు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి పెంచిన బాధితులు
  • గ్రామస్తులు వేధిస్తున్నారని, తనను జైలుకు పంపాలని స్టేషన్‌‌‌‌కు వెళ్లిన నిందితుడు

దేవరకొండ (చింతపల్లి), వెలుగు : రూ. వంద పెట్టుబడి పెడితే రెండు వందలు, రూ. లక్షకు రెండు లక్షలు ఇస్తానంటూ కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తి చివరకు చేతుల్తెతేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. చింతలపల్లి మండలం మాల్‌‌‌‌ (గోడుకొండ్ల)కు చెందిన మదిని సంజయ్‌‌‌‌రెడ్డి కొడుకు మనీశ్‌‌‌‌రెడ్డి మనీశ్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌, స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ పేరుతో నాలుగేళ్ల కింద ఆఫీస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేశాడు. 

రూ. 100 పెట్టుబడి పెట్టిన వారికి రూ. 200, రూ. 1000 పెట్టిన వారికి రూ. 2 వేలు.. ఇలా ఎంత పెట్టుబడి పెట్టినా దానికి డబుల్‌‌‌‌ ఇస్తానంటూ ప్రచారం చేశాడు. చెప్పినట్లుగానే మొదట్లో కొందరికి డబ్బులు ఇచ్చి నమ్మించాడు. గ్రామానికి 10 మంది చొప్పున ఏజెంట్లను నియమించుకొని టార్గెట్లు పెట్టి మర్రిగూడ, నాంపల్లి, యాచారం గ్రామాల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. 

ఇలా ఓ ప్రైవేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, ఓ ప్రభుత్వ బ్యాంక్‌‌‌‌ క్యాషియర్‌‌‌‌తో సహా మొత్తం 200 మంది వద్ద సుమారు రూ. 50 కోట్ల వరకు వసూలు చేశాడు. తర్వాత ఇంటికి, వాహనాలకు లోన్లు సైతం ఇస్తానని నమ్మించాడు. పెట్టుబడి పెట్టిన వారికి గత ఏడు నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు తమ డబ్బులు ఇవ్వాలంటూ మనీశ్‌‌‌‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు.

 దీంతో గ్రామస్తుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సోమవారం సాయంత్రం చింతపల్లి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వెళ్లాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వెళ్లి ‘వడ్డీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు, అసలైనా ఇవ్వాలి’ కోరడంతో ‘నా దగ్గర రూపాయి కూడా లేదు జైల్లో పెట్టుకుంటారా పెట్టుకోండి, చంపేస్తారా.. చంపేయండి’ అంటూ మొండికేశాడు. 

దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులు గ్రామపెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని మనీశ్‌‌‌‌రెడ్డిని గ్రామానికి తీసుకొచ్చారు. బాధితులు మంగళవారం మనీశ్‌‌‌‌ రెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయం అడుగుతుండగా అతడి తల్లి 100 కాల్‌‌‌‌ చేసింది. దీంతో పోలీసులు వచ్చి మనీశ్‌‌‌‌రెడ్డిని స్టేషన్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న దేవరకొండ డీఎస్పీ గిరిబాబు స్టేషన్‌‌‌‌కు చేరుకొని వివరాలు సేకరించారు. ఎంక్వైరీ చేపట్టిన తర్వాత రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ చెప్పారు.