డేటింగ్ మాయ లేడీ : డబ్బున్నోడిని పబ్ కు పిలిచి.. కోక్ తాగి రూ.40 వేల బిల్లు

డేటింగ్ మాయ లేడీ : డబ్బున్నోడిని పబ్ కు పిలిచి.. కోక్ తాగి రూ.40 వేల బిల్లు

హైదరాబాద్ లో మరో కొత్త రకం మోసం బయటపడింది. డేటింగ్ యాప్ ను అడ్డం పెట్టుకొని కొంతమంది యువతులు, పబ్బు యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో టిండర్ యాప్ లో ట్రాప్ చేసి యువకులను నమ్మి మోసం చేస్తున్నారు. యువకులను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.  టిండర్ యాప్ లో యువకులతో కనెక్ట్ అయి..పబ్ లో మీట్ అవుదామని ఇన్వైట్ చేస్తున్నారు. 

రితిక అనే యువతి ఓ యువకుడుతో టిండర్ యాప్ లో కనెక్ట్ అయి హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓ పబ్ కు తీసుకెళ్లి లిక్కర్ ఆర్డర్ చేసింది. 45 వేలు బిల్ ను చేతిలో పెట్టి చల్లగా జారుకుంది. బిల్లు చూసి షాకైనా యువకుడు..పబ్బు యజమానులు, యువతి కలిసి తనను మోసం చేశారని గ్రహించాడు. లిక్కర్ పేరుతో యువతికి కోక్ ఇచ్చి 45 వేల బిల్ వేశారంటూ ..తనకు జరిగిన మోసం పైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయటపెట్టాడు. బిల్లు కట్టకపోతే పబ్ యజమానులు బెదిరించి డబ్బులు కట్టిస్తున్నార