
గద్వాల, వెలుగు: బ్యాంకులో లోన్లు ఇప్పిస్తానంటూ రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఘటన గద్వాలలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కర్నూల్ లోని ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో మార్టిగేజ్ లోన్లు ఇప్పిస్తానని ఒక్కో రైతు నుంచి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశాడు.
గట్టు మండలంలోని 12 మంది రైతులు, గద్వాల మండలంలోని కొంత మంది రైతుల నుంచి డబ్బులు దండుకున్నట్లు వారు పేర్కొన్నారు. డబ్బులు తీసుకొని లోన్లు ఇప్పించకపోవడంతో మోసపోయామని గుర్తించి, పోలీసులకు కంప్లైంట్ చేశారు.