ఈ ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌ పదిహేనువేలు

ఫ్రెంచ్‌‌ ఫ్రైస్‌‌ ధర మహా అయితే యాభై, వంద.. రెండొందలు! ఎంత రెస్టారెంట్‌‌ అయినా వందల్లోనే చార్జ్​చేస్తుంది. కానీ, న్యూయార్క్‌‌లోని ఒక రెస్టారెంట్‌‌ తయారుచేసిన ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌ ధర దాదాపు పదిహేనువేల రూపాయలు. ఇవి ప్రపంచంలోనే అతి ఖరీదైన ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌. ఇంత ఖరీదైన ఈ ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌కు గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లో కూడా చోటు దక్కింది. ఇంతకీ ఇవి ఇంత కాస్ట్లీ ఎందుకు అనుకుంటున్నారా? ఇది తయారు చేసిన పద్ధతి, వాడిన ఇంగ్రెడియెంట్స్‌‌ వల్లే. వీటికోసం ఆలుగడ్డల్లో బెస్ట్‌‌ అయిన చిప్పర్‌‌‌‌బెక్ రకం పొటాటోలు వాడారు. కట్‌‌ చేసిన ఆలుగడ్డల్ని షాంపేన్‌‌, వెనిగర్‌‌‌‌లో నానబెట్టారు. తర్వాత వీటిని రెగ్యులర్‌‌‌‌ పద్ధతిలో ఆయిల్‌‌లో ఫ్రై చేయకుండా, అరుదైన జాతికి చెందిన బాతు కొవ్వులో, రెండుసార్లు ఫ్రై చేశారు. దీనివల్ల ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌ బయట క్రిస్పీగా, లోపల ఫ్లఫ్ఫీగా అయ్యాయి. వీటిపైన ఎడిబుల్‌‌ గోల్డ్‌‌, ట్రఫుల్‌‌ సాల్ట్‌‌, ట్రఫుల్‌‌ ఆయిల్‌‌ స్ప్రింకిల్‌‌ చేశారు. దీంతోపాటు మోర్నే చీజ్‌‌ డిప్‌‌, సాస్‌‌ అందిస్తారు. మష్రూమ్స్‌‌తో గార్నిష్‌‌ చేస్తారు. క్రిస్టల్‌‌ ప్లేట్‌‌లో సర్వ్‌‌ చేస్తారు. వీటన్నింటి వల్లే ఈ ఫ్రెంచ్‌‌ఫ్రైస్‌‌ చాలా కాస్ట్లీగా మారాయి. వీటిని టేస్ట్‌‌ చేయాలంటే న్యూయార్క్‌‌లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్‌‌కు వెళ్లాలి. అది కూడా రెండు వారాలు వెయిట్‌‌చేయాలి.