
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జారీ చేయనున్న అధికారులు
పద్మారావునగర్, వెలుగు: అమర్ నాథ్యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ డిపార్ట్ మెంటులో ఈ సర్టిఫికెట్లు పొందొచ్చని చెప్పారు.
ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఛాతీ, ఎక్స్ రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్ లను తీసుకుని రావాలని పేర్కొన్నారు.