గన్నేరువరంలో ఉచిత అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ సేవలు ప్రారంభం

గన్నేరువరం, వెలుగు:  కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఉచిత అంబులెన్సు సేవలను శుక్రవారం ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ  ప్రారంభించారు.  గన్నేరువరం మండలానికి కనీసం పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ లేకపోవడంతో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొమ్మెర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ సేవలు ప్రారంభించనట్లు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  కొమ్మెర రవీందర్ రెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,  వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.