- దరఖాస్తుల ఆహ్వానం జూన్11 వ తేదీ వరకు గడువు
రంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో 10వ తరగతి చదివి జీపీఏ 7, అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన షెడ్యుల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, దివ్యాంగ స్టూడెంట్లు 2023–-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పాస్వెబ్సైట్లో 10వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ఆటోమెటిక్సిస్టమ్ ద్వారా స్టూడెంట్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.