
ఖైరతాబాద్, వెలుగు: పిల్లల్లో ఆటిజం లక్షణాలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అనన్య చైల్డ్డెవలప్మెంట్ సెంటర్డైరెక్టర్ ఆదిమూలం మాధవి తెలిపారు. ప్రపంచ ఆటిజం అవగాహన మాసోత్సవం సందర్భంగా నేటి నుంచి మూడు నెలలపాటు ఉచిత సదస్సుతోపాటు రెండేళ్ల లోపు చిన్నారుల పెరుగుదల, అభివృద్ధిపై స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడారు.
మాదాపూర్, అల్కాపూర్, బంజారాహిల్స్‌లోని తమ శాఖల్లో పిల్లల తల్లితండ్రులు, కేర్ టేకర్స్‌కు కౌన్సిలింగ్ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9848513192 నంబరు లేదా WWW.ASAP.ORG.IN వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ శివ అనూప్, డాక్టర్ అనిల్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ ప్రణవ్కుమార్పాల్గొన్నారు.