
రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోల ఫ్రీ డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ను నేర్పిస్తున్నారు.18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల మహిళలకు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు కూకట్ పల్లిలోని కార్పోరేషన్ కు చెందిన డీఎంఎస్ వీకే ( దుర్గాబాయ్ మహిళ శిశు వికాస కేంద్రం)లో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ లో ఉదయం, సాయంత్రం ట్రైనింగ్ కొనసాగుతోంది.ఈ కేంద్రంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ లో ట్రైనర్లు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత, క్లాస్ రూమ్ లో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. గతేడాది ఆగస్ట్ లో ట్రైనింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటి వరకు 45 మందికి డ్రైవింగ్ పూర్తయింది. వచ్చే నెల 5 నుంచి మరో బ్యాచ్ స్టార్ట్ కానుంది.
జిల్లాల్లో త్వరలో ట్రైనింగ్
ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు 10 ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో సొంత బిల్డింగ్ లు, ఖాళీ ప్లేస్ లు ఉన్నాయి. వీటిలో డ్రైవింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో జిల్లాల్లోనూ మహిళలకు ఆటో డ్రైవింగ్ , టూ వీలర్ ట్రైనింగ్ నేర్పించేందుకు కార్పోరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో ఈ ట్రైనింగ్ ను స్టార్ట్ చేస్తే భారీ స్పందన వస్తుందని మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.