
కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని వాసవీ కల్యాణ భవనంలో ఆదివారం శ్రీ వల్లభా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బదాం రాజేందర్, డాక్టర్ ఎం.ఎ రఫీ, కైరోప్రాక్టర్ గంప నరేశ్ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ చెరుకుపల్లి రాజేశ్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు బోగ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు ముక్క దాము, జిల్లా ఉపాధ్యక్షుడు సంపెట మల్లయ్య, జిల్లా కార్యదర్శి తుమ్మనపల్లి మహేశ్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి అడువాల ప్రభాకర్, కోరుట్ల టౌన్ ఇన్‌చార్జి ఆడువాల స్వరూప, రాజ్ కిషన్, వెంకటేశం, రాములు, నాగేందర్, కృష్ణ, మోహన్, రవి, శంకర్, రాజు, శ్రీహరి, రాజగంగాధర్, మహేశ్ పాల్గొన్నారు.