కరీంనగర్ జిల్లాల్లో బీసీలకు ఫ్రీ కోచింగ్.. ఏప్రిల్ 8 వరకు గడువు

కరీంనగర్ జిల్లాల్లో బీసీలకు ఫ్రీ కోచింగ్.. ఏప్రిల్ 8 వరకు గడువు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్, జగిత్యాల,పెద్దపల్లి  జిల్లాల్లోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు స్కూల్ ఆఫ్​ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్  ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్  రవికుమార్ శుక్రవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన  నిరుద్యోగులు మార్చి 15న నుంచి ఏప్రిల్ 8వరకు వెబ్ సైట్www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని  సూచించారు. 

బీసీ(ఏ, బీ,డీ)కి చెందిన 26 ఏండ్ల  వయస్సు  ఉన్న  అభ్యర్థులు అర్హులని, తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో  ఏడాదికి రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో  రూ.2లక్షల  లోపు ఉండాలని  వెల్లడించారు.  ఏప్రిల్ 12న ఉమ్మడి కరీంనగర్  జిల్లా కేంద్రంలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీనింగ్  టెస్టు ఉంటుందని, టెస్టులో వచ్చిన మార్కుల ఆధారంగా 30మందిని  ఎంపిక చేయనున్నట్లు  వివరించారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.