ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ఉచిత ట్రైనింగ్ : జి.ప్రవీణ్ కుమార్

ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ఉచిత ట్రైనింగ్ : జి.ప్రవీణ్ కుమార్

నస్పూర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్​లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం నాయక్, ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు జి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామ న్నారు.

హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్- ద్వారా నెల రోజులపాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. డిగ్రీ పూర్తయ్యి 26 సంవత్సారాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు  www.tgbcstudycircle.cgg.gov.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపే ఉండాలన్నారు. అర్హులైన వారికి ఏప్రిల్ 12న ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఆన్​లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, వచ్చిన మార్కుల ఆధారంగా 30 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 08732-221280 నంబర్​లో సంప్రదించవచ్చని, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.